CTR: వెదురుకుప్పం మండలంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్సై నవీన్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.