ఆధార్లో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, చిరునామా వివరాల నమోదులో తప్పులుంటే మార్చుకునేందుకు ఉడాయ్ అవకాశం కల్పిస్తోంది. మై ఆధార్ పోర్టల్లో 17 ఏళ్ల లోపు వారు జూన్ 14 వరకు ఉచితంగా, మిగతా వారు నగదు చెల్లించి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. UIDAI ప్రమాణాల ప్రకారం పేరు మార్చుకునేందుకు రెండుసార్లు, పుట్టిన తేదీకి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫొటో, చిరునామాకు పరిమితి లేదు.