VZM: మినిమం టైం స్కేల్ (MTS) విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం చెల్లిస్తూ, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్టీయూ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవన్లో జిల్లా అధ్యక్షుడు వై. అప్పారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగ భద్రతతో 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.