BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు.