WNP: గోపాలపేటలోని కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నులకు పండుగగా జరిగింది. ఈ పవిత్ర సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.