HNK: నగరంలోని ఎక్సైజ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.