NGKL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రైతులకు సాగు పరికరాలను పంపిణీ చేశారు. మండలంలోని పలువురు రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముచ్చటిస్తూ, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని సూచించారు.