ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవం తిలకించడానికి భక్తాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.