BDK: జూలూరుపాడు మండల వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును నిర్వహించారు. జీలకర్ర బెల్లం కార్యక్రమంతో భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మార్మోగగా, వేద మంత్రోచ్చారణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.