ADB: నేషనల్ హైవే 44, ఇతర జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన పార్లమెంటు సమావేశాల్లో MP నగేష్ మాట్లాడారు. NH-44 నాలుగు నుంచి రహదారిని 6 వరుసల రహదారిగా మార్చాలని కోరారు. చంద్రపూర్ నుంచి మాహోర్, గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.