BHNG: ఆలేరు మున్సిపాలిటీ 2026-27 అంచనా బడ్జెట్, 2025-26 సవరణ బడ్జెట్ ఆమోదానికి శుక్రవారం ఛైర్పర్సన్ బీజాన బాలమణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడుతూ.. రూ.166.01 లక్షలతో పట్టణ అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.