TG: HYD అంబర్పేట్లోని ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేశారు. బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగుల రసాయనాలను కలుపుతున్నట్లు వెల్లడైంది. అలాగే బిస్కెట్లలో నాసిరకం పిండి, పాడైన గుడ్లను వాడుతున్నట్లు తేలింది. దీంతో నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.