ప్రకాశం: పాత సింగరాయకొండలోని దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఏప్రిల్ 2న పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఈవో కృష్ణవేణి వివరాలు వెల్లడించారు. ఆరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.