VKB: మర్పల్లి మండల పరిధిలోని బూచనపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు గ్రామ చరిత్రలోనే నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా జరిగాయి. ‘జై శ్రీరామ్’ నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పస్తపురం లాల్ రెడ్డి, అనిత దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.