NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కుక్కలగుట్ట శ్రీ వెంకటేశ్వర మందిర ప్రాంగణంలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్, సభ్యుడు క్యాతం బాపురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ కల్పగురు ప్రభుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.