KNR: గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల, కురిక్యాల, మధురానగర్ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ రామనవమి వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఉప్పరమల్యాలలో కొండగట్టు దేవాలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పాల్గొన్నారు.