NGKL: వెల్దండ మండలం చెరుకూరులో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలకు శ్రీను (కడప) రూ. లక్ష విరాళం శుక్రవారం అందజేశారు. భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, ఆలయ నిర్మాణానికి తోడ్పడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ కొండల్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.