AP: పేదవారికోసం మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. మెడికల్ కాలేజీలను తమ వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీపై యరపతినేనితో ఎక్కడైనా చర్చకు సిద్దమని సవాల్ చేశారు.