ADB: ఉట్నూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా భానోత్ జైవంత్ రావు వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల హక్కుల రక్షణతో పాటు వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.