PDPL: కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉత్సవ మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ మల్లయ్య, కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.