పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, భగ్గుమన్న చమురు ధరలతో స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనం కాగా.. నిఫ్టీ 23 వేల మార్క్ కిందకు దిగజారింది. దీంతో BSE నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.422 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఒక్క రోజే మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర ఆవిరైంది.