VSP: జీవీఎంసీ 39వ వార్డు లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ప్రాజెక్ట్ యువ కింద క్రికెట్ బాక్స్ స్టేడియాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. వేదాంత సంస్థ CSR నిధులతో రూ.16 లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ స్టేడియం యువతలో క్రీడలపై ఆసక్తి, ఫిట్నెస్ పెంపుకు తోడ్పడనుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.