KRNL: గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని ఆలూరు MLA విరుపాక్షి అన్నారు. ఇవాళ కమ్మరిచేడు గ్రామంలో MPP నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన మంచి నీటి కొళాయిలను ఆయన ప్రారంభించారు. కుళాయిలు ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించినప్పటికీ.. ప్రజలకు తాగునీరు అందించామని పేర్కొన్నారు.