VZM: పంచెకట్టుతో ఎస్పీ దామోదర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామతీర్థంలో వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధమైన పంచెకట్టుతో, సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన ఎస్పీ కుటుంబం భక్తుల దృష్టిని ఆకర్షించారు.