NLG: శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా దేవరకొండలోని కోదండ రామాలయంలో, 4వ వార్డులో హరిహర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలన్నారు.