SRD: నిజాంపేట మండలం ర్యాలమడుగులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డా. ముదసిర్ క్యాంపులో వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు బలహీనంగా ఉన్న వారికి ఉచిత శాస్త్ర చికిత్సకు రెఫర్ చేసినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతంలో క్యాంపు నిర్వహించడం హర్షనీయమని సర్పంచ్ బలరాం అన్నారు.