యుద్ధం నేపథ్యంలో భారతీయ విమానయాన రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.18 వేల కోట్ల మేర నష్టాన్ని నమోదు చేస్తుందని ICRA తెలిపింది. పలు దేశాలు తమ గగన తలాలను మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, టర్బైన్ ఇంధన ధరలు పెరగడం కారణంగా చూపింది. 2025 డిసెంబరులో ఇండిగో సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇబ్బందులను ఈ నివేదికలో గుర్తు చేసింది.