NRML: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కడెం మండలంలోని దిల్దార్ నగర్ సర్పంచ్ బద్దెనపల్లి స్టిఫెన్ అన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ శుక్రవారం వారికి నూతన దుస్తులు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.