MDK: రామాయంపేట మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ 24 గంటల్లో సొంతగూటికి చేరారు. BRS పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన ప్రవీణ్ గురువారం పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తిరిగి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. అయితే తనను కొందరు అభివృద్ధి పేరిట మభ్య పెట్టారని ఆయన ఆరోపించారు.