KMM: కూసుమంచి మండలం నాయకనూడెం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 1న రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం, 2న ఊరేగింపు నిర్వహించనున్నట్లు అర్చకులు సంపత్ కుమార్ భట్టర్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక సేవలు ఉంటాయని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.