టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఖరారైంది. ప్రముఖ OTT సంస్థ జీ5లో మార్చి 31 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా రూపొందింది.