ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బోథ్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదింటి ప్రజల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.