CTR: చిత్తూరు టాప్‌లైన్ పోలీస్ క్వార్టర్స్‌లోని శ్రీ సీతారామ దేవాలయంలో ఏఆర్ పోలీసులు శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరగగా, ఎస్పీ తుషార్ డూడి, కలెక్టర్ సుమిత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.