BHNG: చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి దంపతులు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు.