MDK: మెదక్ మండలం ఔరంగబాద్‌లో క్రైస్తవుల మహాశ్రమల దినాల ఉపవాస ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా కొనసాగుతున్నాయి. గత 45 రోజులుగా స్థానిక క్రైస్తవులు కఠిన నిష్టతో ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ జేమ్స్ రవీందర్ మాట్లాడుతూ.. క్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ, దేవుని మహిమను పొందేందుకు ఈ ప్రార్థనలు దోహదపడతాయని తెలిపారు.