AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే తనపై జరిగిన దాడి గురించి ఆయన స్పందించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకివీడు రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని తెలిపారు.