WNP: ఇటీవల కాలంలో జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో పనిచేస్తున్న అభి అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిందితునిపై కఠిన చర్య తీసుకునే విధంగా పాటుపడతానని పేర్కొన్నారు.