MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈరోజు రాములోరి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలో ఏటూరునాగారం మేజర్ జీపి సర్పంచ్ కాకులమర్రి శ్రీలత- లక్ష్మణ్ బాబులు పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణాన్ని తిలకించారు.