JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గీత కార్మికుడు కోతి అనిల్ తాటిచెట్టుపై నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం తాటి చెట్లు గీయడానికి వెళ్లిన అనిల్, అకస్మాత్తుగా చెట్టుపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు.