NGKL: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గతేడాది సమస్యలు, పైపులైన్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలని సూచించారు. నీటి సరఫరా నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.