ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో లారీ వెనుక బైక్‌పై ప్రయాణిస్తున్న టంగుటూరు ఎస్సై వాహనం ఒక్కసారిగా లారీ ఆగడంతో వెనకవైపు నుంచి ఢీకొన్నారు. దీంతో ఎస్సైతో పాటు డ్రైవర్‌కు, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వీరిని వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.