AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామాలయం స్థలం విషయంలో 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడికి ఓ వర్గం యత్నించింది. అయితే కూటమి నాయకులు అప్రమత్తమై దాడిని అడ్డుకున్నారు. కూటమి నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.