ఢిల్లీ-NCR ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా నోయిడా ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో జేవార్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన యూపీ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు.