NLG: దేవరకొండ మండలం మైనంపల్లి HRD కాలేజ్ గేట్ వద్ద ఉన్న ప్రజలకు సౌకర్యార్థం మంచినీటి నూతన బోర్ మోటర్‌ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బాలునాయక్ సూచన మేరకు సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ పాలక వర్గ సభ్యులతో కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలునాయక్, వార్డు సభ్యులు కొర్ర కిషన్ నాయక్ ఉన్నారు.