విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘స్లమ్ డాగ్’ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. విజయ్‌తో కలిసి పనిచేయడం చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఆయన ఒక గొప్ప వ్యక్తి అని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ క్రేజీ కాంబోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.