JN: పాలకుర్తిలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. వంట చేసే విధానం, ఆహారం ఉడికించే విధానం, ఉపయోగిస్తున్న బియ్యాన్ని, పప్పులు, ఉల్లిగడ్డలు, తదితర సరుకుల నాణ్యతను పర్యవేక్షించారు. నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.