NLG: చిట్యాల మున్సిపాలిటీలోని పదవ వార్డు, అంబేద్కర్ నగర్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.