TG: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.