సత్యసాయి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్ల సింగయ్య గారి పల్లెలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అపర్ణరెడ్డి దంపతులు సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో జరిపించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.