GNTR: శ్రీరామ నవమి సందర్భంగా గుంటూరు నగరంలో నిర్వహించిన శోభాయాత్రను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బృందావన్ గార్డెన్స్‌లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యాత్రను ఘనంగా చేపట్టారు. తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా శోభాయాత్ర నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు.